కవిత ఒక్కటి
కవిత ఒక్కటి
కూరుస్తా
మదులు ఎన్నో
హత్తుకుంటా
పువ్వులు ఎన్నో
పూయిస్తా
నవ్వులు ఎన్నో
చిందిస్తా
అందాలు ఎన్నో
చూపిస్తా
అనందాలు ఎన్నో
చేరుస్తా
ఒక్క కవితను
ఆవిష్కరించనా
ఒక్క నిమిషము
ఆలోచింపజేయనా
అందాల కవితను
అల్లనా
అందరి మదులను
ఆకట్టుకోనా
కమ్మని కవితను
వండనా
పంచ భక్ష్యాలను
వడ్డించనా
చక్కని కవితను
చదవనా
చెవులకు శ్రావ్యతను
చేర్చనా
మేలైన కవితను
ముందుంచనా
ముచ్చట కొలిపి
మదులనుదోచుకోనా
తీయని కవితను
చదివించనా
తేనె చుక్కలను
చిందించనా
అద్భుత కవితను
అందించనా
ఆనంద కడలిలో
ముంచేయనా
కొత్త కవితను
చెప్పనా
నూతన సందేశము
చేర్చనా
విశేష కవితను
విరచించనా
వింత విషయాలను
విశదీకరించనా
ప్రత్యేక కవితను
పఠించనా
పాఠకుల హృదయాలను
పులకరించనా
కవిత
ఒక్కటి
రాస్తా
కొత్తది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment