కవితాసృజన
మనసు పెట్టా
ఆలోచన చేశా
ఏటికి వెళ్ళా
మట్టిని తెచ్చా
నీటిని కలపా
మెత్తగ పిసికా
బొమ్మను చేశా
రూపము నిచ్చా
రంగులు అద్దా
బట్టలు కట్టా
అందముగా చేశా
ఆనందము పొందా
ప్రాణం పోశా
ప్రేమను చూపా
మాటలు నేర్పా
ముద్దుగ పలికించా
నవ్వులు చిందించా
మోమును వెలిగించా
పూలు పెట్టా
పరవశ పరచా
ఆటలు ఆడించా
పాటలు పాడించా
నదకను నేర్పా
నాట్యము చేయించా
కలమును పట్టా
కాగితంపై వ్రాశా
అక్షరాలు అల్లా
అర్ధాలు స్ఫురించా
పదాలను పేర్చా
ప్రాసలు కుదిర్చా
విషయము వివరించా
వినోదము అందించా
కవితను కూర్చా
కితాబులు పొందా
అందరిని చదివించా
ఆలోచనలు పారించా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment