జాగ్రత్త


పాములు

తిరుగుతున్నాయి

బుసలు

కొడుతున్నాయి

విషము

కక్కుతున్నాయి

జాగ్రత్త

కరుస్తాయి


గ్రద్దలు

ఎగురుతున్నాయి

పరిసరాలు

పరికిస్తున్నాయి

తన్నుకొని

పోవాలనిచూస్తున్నాయి

జాగ్రత్త

ఎత్తుకెళతాయి


నక్కలు

కాచుకొనియున్నాయి

మోసము

చెయ్యాలనుకుంటున్నాయి

నోరును

తెరుచుకొనియున్నాయి

జాగ్రత్త

ఖతంచేస్తాయి


కొంగలు

జపాలుచేస్తున్నాయి

ప్రవచనాలు

బోధిస్తున్నాయి

నిజము

దాస్తున్నాయి

జాగ్రత్త

చిక్కితేమ్రింగేస్తాయి


జంగుపిల్లులు

తిరుగుతున్నాయి

గంపలు

ఎత్తాలనుకుంటున్నాయి

కడుపును

నింపుకోవాలనుకుంటున్నాయి

జాగ్రత్త

శ్రద్ధగాకాపలాకాయి


తోడేల్లు

చరిస్తున్నాయి

పల్లు

బయటపెడుతున్నాయి

గొర్రెలను

మెడపట్టితీసుకెళ్ళాలనిచూస్తున్నాయి

జాగ్రత్త

రక్షించటానికిసిద్ధంగాయుండవోయి


మృగాలు

మనమధ్యనేయున్నాయి

కాటు

వేయటానికైచూస్తున్నాయి

ప్రాణము

తీయటానికివెనకాడకున్నాయి

జాగ్రత్త

బాధ్యతవీడకబరువుమోయవోయి


దొంగలు

పక్కనేయున్నారు

నేరాలు

చేయాలనుకుంటున్నారు

సొమ్మును

కాజేయలనుకుంటున్నారు

జాగ్రత్త

ఉండవోయిపారాహుషారు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog