కళ్ళు


ఆకళ్ళు

వెలుగుతున్నాయి

కాంతులు

వెదజల్లుతున్నాయి


ఆకళ్ళు

పిలుస్తున్నాయి

చూపులు

విసురుతున్నాయి


ఆకళ్ళు

వలవేస్తున్నాయి

దృష్టిని

ఆకర్షిస్తున్నాయి


ఆకళ్ళు

చూస్తున్నాయి

అనుభూత్తులు

పంచుతున్నాయి


ఆకళ్ళు

అందాలుచూపుతున్నాయి

ఆనందము

కలిగించుతున్నాయి


ఆకళ్ళు

నవ్వుతున్నాయి

మోమును

వెలిగిస్తున్నాయి


ఆకళ్ళు

లాగుతున్నాయి

మనసును

కట్టిపడవేస్తున్నాయి


ఆకళ్ళు

కాటుకపెట్టాయి

అందము

రెట్టింపుచేశాయి


ఆకళ్ళు

రెపెరెపలాడుతున్నాయి

ముఖము

కళకళలాడుతుంది


ఆకళ్ళు

మత్తెక్కిస్తున్నాయి

మనసును

దోచేస్తున్నాయి


ఆకళ్ళను

రోజూచూస్తున్నా

ఆభావాలను

నిత్యముగమనిస్తున్నా


ఆకళ్ళను

జ్యోతులుచేస్తా

ఆమనసును

ఆహ్లాదపరుస్తా


ఆకళ్ళు

ఆమెకాయుధం

ఆచూపు

నాకొకగాలం


మీకళ్ళకు

కవితనందిస్తా

మీమనసును

ఆనందపరుస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog