విలపిస్తున్న ఖైదీ


ఖైదీ

విలపిస్తున్నాడు

జల్దీ

విడిపించమంటున్నాడు


జైలు

వద్దుంటున్నాడు

బైలు

వేడుకుంటున్నాడు


కుర్చీ

లేదంటున్నాడు

బల్ల

ఇవ్వమంటున్నాడు


దొంగను

కాదంటున్నాడు

బెంగను

పెట్టుకొనియున్నాడు


దోమలు

కుడుతున్నాయంటున్నాడు

ఈగలు

ముసురుతున్నాయంటున్నాడు


శుభ్రం

లేదంటున్నాడు

రోగం

రావచ్చంటున్నాడు


పంకా 

తిరగటంలేదంటున్నాడు

ఉక్క 

పోస్తుందంటున్నాడు


భార్య

జోడులేదంటున్నాడు

కొడుకు

తోడులేడంటున్నాడు


మనుమడి

ముచ్చట్లులేవంటున్నాడు

మనుమరాలి

ముద్దులులేవంటున్నాడు


తప్పు

చేయలేదంటున్నాడు

శిక్ష

వేయవద్దంటున్నాడు


చర్మరోగం

వచ్చిందంటున్నాడు

చల్లదనం

కల్పించమంటున్నాడు


న్యాయం

చేయమంటున్నాడు

ఆలశ్యం

చేయొద్దంటున్నాడు


వృద్ధుడను

అంటున్నాడు

శ్రద్ధను

చూపమంటున్నాడు


కడిగినముత్యంలా

బయటకొస్తానంటున్నాడు

నిప్పుకణికనని

నిరుపించుకుంటానంటున్నాడు


చూద్దాం

వేచిచూద్దాం

రేపోమాపోసత్యం

తెలుసుకుందాం


నిజం

నిప్పులాంటిదెప్పుడు

నేడోరేపో

బయటపడకతప్పదు


మోసగాళ్ళను

నిలదీద్దాం

వోటుతోవెన్నును

విరగగొడదాం


నేరగాళ్ళకి

బుద్ధిచెబుదాం

నిజాయతీపరులకి

అండగానిలుద్దాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog