గడ్డిపూలు


దారిన

వేళ్తుంటే

దాపున 

దర్శనమిస్తాయి గడ్డిపూలు


తొంగి

చూస్తుంటాయి

తోడుకు

రమ్మంటాయి గడ్డిపూలు


పక్కకు

పిలుస్తాయి

పరవశము

కలిగిస్తాయి గడ్డిపూలు


తలలు

ఊపుతుంటాయి

కళ్ళను

కట్టేస్తుంటాయి గడ్డిపూలు


బాట్తపక్కల

దాక్కొనుంటాయి

బాటసారులమదుల

దోచుకుంటుంటాయి గడ్డిపూలు


నిశితంగా

పరికిస్తాయి

నేస్తంగా

పరిగణిస్తాయి గడ్డిపూలు


పలకరిస్తే

పులకరిస్తాయి

పరిహసిస్తే

బాధపాడతాయి గడ్డిపూలు


తొక్కినా

తొణకవు

తిట్టినా

బెణకవు గడ్డిపూలు


గుబురుగా

ఎదుగుతాయి

గుట్టుగా

బ్రతుకుతాయి గడ్డిపూలు


పొట్టిపువ్వంటే

పకపకలాడతాయి

చిన్నిపువ్వంటే

చిరునవ్వులుచిందుతాయి గడ్డిపూలు


పువ్వంటే

ఎదైనాపువ్వే

పెద్దాచిన్నా

తేడాలేదంటా


అన్నిపూలను

ప్రేమిస్తా

అన్నిటిని

ఒకటిగాచూస్తా


గడ్డిపూలని

చిన్నచూపుచూడకండి

గరికపూలని

హేళనచేయకండి


మనుషులంతా

ఒకటే

పువ్వులన్నీ

సమమే


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog