కవులు


కవులు

నియంతలు

కవితలు

శాసనాలు


అక్షరాలు

అమ్ముడుపోవు

కవీశ్వరులు

కొనటానికిలేరు


కవులు 

నిప్పుకణికలు

గోకకు

కాల్చుకోకుచేతులు


కాలేకడుపులు

చూపిస్తారు

ప్రజలకష్టాలు

చర్చిస్తారు


నిజాలు

చూపుతారు

నిప్పులు

కక్కుతారు


అక్రమాలు

ఎరిగిస్తారు

అన్యాయాలు

ఎదిరిస్తారు


అందాలు

చూపిస్తారు

ఆనందాలు

కలిగిస్తారు


కవిత్వం

కూరుస్తారు

చైతన్యం

తెచ్చేస్తారు


గళాలు

వినిపిస్తారు

మనసులు

ముట్టేస్తారు


కళ్ళు

తెరిపిస్తారు

కుళ్ళు

కడిగేస్తారు


కలాలను

ఝళిపిస్తారు

కిలాడీలను

కుమ్మేస్తారు


కవులు

సమాజహితులు

కవనాలు

జాగృతిసాధనాలు


ఏ పుట్టలో

ఏ పామున్నదో

ఏ పుటలో

ఏ భావమున్నదో


ఏ కలంలో

ఏ కల్పనున్నదో

ఏ తలలో

ఏ తలపున్నదో


ఏ కవిలో

ఏ ఘనతున్నదో

ఏ కవితలో

ఏ మర్మమున్నదో


అసలైనకవులను

ఆహ్వానించు

సిసలైనకైతలను

స్వాగతించు


కవితలు

చదువు

కన్నులు

తెరువు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog