ఓ అభాగ్యుడు చెప్పినకథ


కనురెప్ప

కాటేసింది

ఎవరికి చెప్పను?


తాడు

పామైకరచింది

ఏమి చెయ్యను?


భార్య

ఎడమయ్యింది

ఎలా బ్రతకను?


తనయుడు

తరిమేశాడు

ఎక్కడికి వెళ్ళను?


గుండె

గాయపడింది

ఎలా తట్టుకోను?


కన్నీరు

కారుతుంది

ఎలా ఆపుకోను?


మాటలు

పెగలటంలేదు

ఎలా చెప్పను?


చేతులు 

చాచలేకుంటిని

ఏమి చేయగలను?


కాళ్ళు

కదపలేకుంటిని

ఎలా వెళ్ళను?


అన్నము

సహించుటలేదు

ఎలా జీవించగలను?


వల్లకాడు 

పిలుస్తుంది

ఎలా తప్పించుకోను?


గొంతు

మూగపోయింది

ఎలా వీడుకోలుచెప్పను?


మనసు

మూలనపడింది

ఎలా సెలవుతీసుకోను?


హృదయము

ద్రవిస్తుంది

ఎలా తట్టుకోను?


కథ 

ముగిసింది

ఎలా దాచుకోగలను?


బాధ

బరువెక్కింది

ఎలా భారముదించుకోను?


కలము

కదలటంలేదు

ఎలా కైతనుకూర్చను?


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog