తెలుగోడా తెలుసుకో!
ఆంధ్రాప్రాంతం
విడిపోయింది కాని
తెలుగుప్రజలు
వేరుపడలేదని తెలుసుకో
ఆంధ్రారాష్ట్రం
కుచించింది కాని
తెలుగుభాష
తరగలేదని గుర్తించుకో
ఆంధ్రాపెత్తనం
తగ్గియుండవచ్చు కాని
తెలుగోళ్ళపౌరుషం
తాకట్టు పెట్టలేదనుకో
అంధ్రాగాలులు
వీచకపోవచ్చు కాని
తెలుగుచైతన్యము
అణగిపోలేదనుకో
ఆంధ్రులసమైక్యత
దెబ్బతినవచ్చు కాని
తెలుగుజాతిని
అవమానానికి గురిచేయకురో
ఆంధ్రా ఓటర్లు
అమాయకులు కాని
తెలుగువారిని ఆశపెట్టి
ఎన్నికలలోమోసం చేయనీయవద్దురో
ఆంధ్రులకు భాషాభిమానం
లేదనంటారు కాని
తెలుగులమదులలలో తెలుగుతల్లి
కొలువుతీరియున్నది దర్శించుకో
ఆంధ్రులనాయకత్వం
అప్రతిష్టపాలుకావచ్చు కాని
ఆంధ్రులప్రతిభ
అసమాన్యమైనదని తెలుపరో
అంధ్రాజనం
అభిమానవంతులు కావచ్చుకాని
వారు వెర్రివాళ్ళుకాదని
విశ్వానికి చాటరో
ఆంధ్రారైతులకు
కలసిరాకపోవచ్చు కాని
తెలుగుసేద్యగాళ్ళు
సోమరుల కాదనిచెప్పరో
ఆంధ్రాకవితలు
తక్కువ కావచ్చుకాని
తెలుగుకవులు
నిష్ణాతులని చెప్పరో
ఆంధ్రులుగొప్పలు
చెప్పుకునేవారుకాదు కాని
తెలుగుప్రాణులు
తీపికాపలుకుతాయని చూపరో
తెలుగుకు తక్కువచేస్తే
తిరగబడతా గళమెత్తుతా
ఆంధ్రులను అవమానపరిస్తే
ఉద్యమిస్తా కసితీర్చుకుంటా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment