నాతలలోని తలపులు


తలలోతట్టిన

తలపులను

తేటతెలుగులో

తియ్యగాచెప్పాలనుకుంటున్నా


బుర్రలోతట్టిన

ఊహలను

మూటకట్టి

భద్రపరచాలనుకుంటున్నా


కలలోకొచ్చిన

సంగతులను

కట్టగట్టి

దాచిపెట్టుకోవాలనుకుంటున్నా


మధురమైన

ఙ్ఞాపకాలను

మంచికవితలుగాకూర్చి

ముచ్చటతీర్చుకోవాలనుకుంటున్నా


కమ్మనైన

విషయాలను

కాగితాలపైచెక్కి

కుతూహలపడాలనుకుంటున్నా


అందమైన

దృశ్యాలను

కళ్ళల్లోబంధించి

పుటలకెక్కించాలనుకుంటున్నా


అందిన

ఆనందాలను

అచ్చతెలుగులోకిమార్చి

ఆహ్లాదపరచాలనుకుంటున్నా


కలంచెప్పిన

కవితలను

పాఠకులకుపంపి

పరవశపరచాలనుకుంటున్నా


తలపులతట్టను

తలకెత్తుతా

భారాన్ని

భరిస్తారా


తియ్యనికైతలను

వడ్డిస్తా

తనివితీరా

ఆస్వాదిస్తారా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog