గరికపూలు


పూలజాతి అంతాసమానము

లేదు ఎక్కువతక్కువనేభేదము

చౌకబారుమాటలను వినవద్దు

గడ్డిపూలను  అపహసించొద్దు


ఎవరన్నారు

గరికాపూలు కవితకనర్హమని

నేను వ్రాస్తా

మీరు చదివిచెబుతారా


ఎవరన్నారు 

గరికపూలు సుందరరహితాలని

నేను చూపిస్తా

మీరు చూచిచెబుతారా


ఎవరన్నారు

గరికపూలు సువాసనలులేనివని

నేను సేకరిస్తా

మీపైచల్లుతా పీల్చిచెబుతారా


ఎవరన్నారు

గరికపూలు పుప్పొడిలేనివని

నేను తీసుకొనివస్తా

మీరు తాకిచెబుతారా


ఎవరన్నారు

గరికపూలు తావిలేనివని

నేను మధువుక్రోలే సీతాకోకచిలుకలచూపిస్తా

మీరు కనిచెబుతారా


ఎవరన్నారు

గరికఫూలను తుమ్మెదలాశ్రయించవని

నేను వ్రాలినతేనెటీగలను చూపిస్తా

మీరుచూచి నిజముతెలుసుకుంటారా


ఎవరన్నారు

గరికపూలు పూజకుపనికిరానివని

నేను తెచ్చిస్తా

మీరుపూజచేస్తే దేవుడొద్దంటాడేమోచూస్తారా


ఎవరన్నారు

గరికపూలకు సుస్వరూపాలులేవని

నేను తీసుకొనివస్తా

మీరు పరికించిచెబుతారా


ఎవరన్నారు

గరికపూలకు మనసులేదని

నేనువాటితో కలసియాడుతా

అవి ఎలాసంతసిస్తాయోచూస్తారా


గరికపూలను

చులకనచేయకు

గడ్డిపూలను

వ్యధలకుగురిచేయకు


చిన్నవే

ముద్దురా

సూక్ష్మంలొనే

మోక్షమురా


పువ్వులన్నియు

పారిజాతాలు కానక్కరలేదురా

పురుషులందరు

పుణ్యపురుషులు అవనక్కరలేదురా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog