కవితాంశాలు
కవితకు
కావాలి పెక్కుయంశాలు
కవితలు
తట్టాలి పలుహృదయాలు
కవితలకు
విషయాలు ప్రాణం
కయితలకు
భావములు మూలం
కవితలు
కట్టేయాలి మదులను
కయితలు
గుచ్చుకోవాలి గుండెలకు
కవితలు
చూపాలి అందాలను
కైతలు
ముట్టాలి మదులను
రాతలు
కలిగించాలి సంతసాలు
రచనలు
వెలిగించాలి మోములు
కవితలు
చూపించాలి ప్రకృతి
కవనాలు
కలిగించాలి నివృతి
సాహిత్యం
చాటాలి ప్రేమలు
కవిత్వం
పెంచాలి అనురాగాలు
కవితలు
పెంచాలి స్నేహాలు
కయితలు
కలిగించాలి మమకారాలు
కవితలు
చూపాలి జాబిలిని
కయితలు
చల్లాలి వెన్నెలని
కవితలు
చూపించాలి కొండాకోనలను
కైతలు
పారించాలి సెలయేటిధారలను
కవులను
కవ్వించాలి కోమలాంగులు
కవితలను
కడువ్రాయించాలి కాంతామణులు
కవనం
కవులకు ప్రాణం
కవిత్వం
పాఠకులకు పఠనీయం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment