పుష్పిక
మా ఇంట
మొక్కొకటి మొలిచింది
మా మీద
మంచిముద్రనూ వేసింది
మా ఇంటికి
మహలక్ష్మి అయ్యింది
మా మదులను
ముచ్చటా పరిచింది
మా నోర్లలో
నాలుకా అయ్యింది
మా కళ్ళల్లో
వెలుగుగా మారింది
ఆమొక్కను
ప్రేమగా చూశాను
అనునిత్యము
ఆలనాపాలనా చేశాను
ఆమొక్కపై
సుధాజల్లులు చల్లాను
అభిమానించి
పెంచిపెద్దగా చేశాను
ఆ మొక్క
ఒకమొగ్గను తొడిగింది
అందరి
మదులనూ దోచింది
ఆ మొగ్గకి
పుష్పిక అనిపేరుపట్టాను
ఎదుగుదలను
ప్రతిక్షణమూ గమనించాను
పుష్పిక
అందాలు చూపింది
అందరికి
ఆనందమూ ఇచ్చింది
పుష్పిక
పువ్వుగా మారింది
పరిసరాల
పరిమళమూ చల్లింది
ఆ మొక్కకు
అభినందనలు
ఆ పుష్పికకు
ఆశీర్వాదాలు
ఆమొక్క
సుధ
ఆమొగ్గ
పుష్పిక
సుధ
అమృతజల్లులు చల్లుతుంది
పుష్పిక
తేనెచుక్కలను చిమ్ముతుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment