శ్రోతలడగనిపాట
(హోరుగాలి)
గాలి
పాటపాడుతుంది
చెట్లు
తలలూపుతున్నాయి
కొమ్మలు
కదులుతున్నాయి
ఆకులు
ఊగిపోతున్నాయి
నెమలి
నాట్యంచేస్తుంది
వనము
పులకించిపోతుంది
పక్షులు
కిలకిలారవాలుచేస్తున్నాయి
పశువులు
గడాబిడాకూతలేస్తున్నాయి
మబ్బులు
గుమికూడుతున్నాయి
ఆకాశము
నీలిరంగుపులుముకుంది
చినుకులు
చిటపటమంటురాలుతున్నాయి
కప్పలు
బెకబెకమంటుగోలచేస్తున్నాయి
చంద్రుడు
గమనిస్తున్నాడు
వెన్నెలను
కుమ్మరిస్తున్నాడు
పువ్వులు
విచ్చుకుంటున్నాయి
పరిమళాలను
వెదజల్లుతున్నాయి
నదులు
గలగలానిండుగాప్రవహిస్తున్నాయి
అలలు
చకచకాకడలిలోయెగిసిపడుతున్నాయి
కవులు
కలాలుపడుతున్నారు
కవితలను
కుప్పలుగాకూరుస్తున్నారు
ప్రకృతి
పరవశపరుస్తుంది
మదులను
మైమరిపించుతుంది
ప్రకృతిగానం
అద్భుతం
ప్రాణులస్పందనం
అమోఘం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment