శ్రవణానందాలు


తీయని

పలుకులు

తనివికి

తృప్తినిస్తున్నాయి


కమ్మని

రాగాలు

కునుకులు

తీయిస్తున్నాయి


శ్రావ్యమైన

సంగీతం

సంతసాన్ని

స్రవిస్తుంది


అమ్మ

జోలపాటలు

హాయిని

చేకూరుస్తున్నాయి


నాన్న

ప్రబోధాలు

సన్మార్గాన్ని

చూపిస్తున్నాయి


మిత్రుల

మన్ననలు

మేనుని

మరిపిస్తున్నాయి


పసిపాపల

మాటలు

ముద్దులు

ఒలుకుతున్నాయి


పడుచుల

పెదవులు

మాధుర్యాలను

కుమ్మరిస్తున్నాయి


ముద్దుగుమ్మల

గొంతుకలు

మనసులను

మురిపిస్తున్నాయి


చెలి

సరసాలు

సరదా

పరుస్తున్నాయి


పక్షుల

రవాలు

వీనులకు

విందునిస్తున్నాయి


కోకిలల

కంఠాలు

ఆనందాన్ని

అందిస్తున్నాయి


కోడి

కూతలు

వేకువనే

మేలుకొలుపుతున్నాయి


చిలుకల

సవ్వడులు

చెవులను

ఆకర్షిస్తున్నాయి


మాష్టారి

మందగింపులు

పట్టుదలగా

చదివిస్తున్నాయి


ప్రాసయుక్త

పదాలు

పసందు

కలిగిస్తున్నాయి


లయాత్మక

పంక్తులు

సెలయేరులా

ప్రవహిస్తున్నాయి


పల్ల్లవి

పాటలకు

ప్రాణం

పోస్తుంది


కవుల

గళాలు

కర్ణాలకు

ప్రియంచేకూరుస్తున్నాయి


వాణీవీణా

నాదాలు

వేడుక

చేస్తున్నాయి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం





Comments

Popular posts from this blog