కుసుమాలు కవితలు
విరులు
విచ్చుకుంటున్నాయి
పొంకాలు
పరవశపరుస్తున్నాయి
తేటులు
తేనెనుక్రోలుతున్నాయి
సౌరభాలు
చుట్టూవ్యాపిస్తున్నాయి
మస్తిష్కాలు
ముచ్చటపడుతున్నాయి
కుసుమాలు
కాంతలకొప్పులెక్కుతున్నాయి
కవులను
కవ్వించుతున్నాయి
కలాలను
కదిలించుతున్నాయి
కవితలను
కూర్పించుతున్నాయి
మనసులను
మురిపించుతున్నాయి
కుసుమాలను
చూడండి
అందాలు
కాంచండి
కైతలను
చదవండి
ఆనందమును
పొందండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment