బాలల్లారా!
బాలల్లారా
భావీభారత పౌరుల్లారా
బుజ్జాయిల్లారా
బుజిబుజినడకల పిల్లల్లారా
బుడతల్లారా
బంగరు బొమ్మల్లారా
పసికూనల్లారా
బడికెళ్ళే విద్యార్ధుల్లారా
బడికి నిత్యము
విధిగా వెళ్ళండిరా
బంగరు భవితకు
బాటలు వెయ్యండిరా
అమ్మానాన్నకు
ముద్దులు పెట్టండిరా
ముద్దుముద్దుగా
మాటలు చెప్పండిరా
బుద్ధులు
చక్కగ నేర్వండిరా
సుద్దులు
చాలా చదవండిరా
అందరితో
ప్రీతిగ పలకండిరా
జీవితంలో
నీతిగ బ్రతకండిరా
మీరక
పెద్దలమాటలు వినండిరా
తప్పక
గురువులును గౌరవించండిరా
పాఠశాలలో
ప్రావీణ్యత పొందండిరా
పోటీపరీక్షల్లో
ప్రతిభను చాటండిరా
భవిష్యత్తు
మీదిరా
జీవితములు
మీవిరా
ఉన్నతస్థితికి
చేరండిరా
అభివృద్ధిని
సాధించండిరా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
🌷🌷🌷🌷🌷అందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు🌷🌷🌷🌷🌷
Comments
Post a Comment