కవితకోసం


నెత్తిని

తవ్వుతా

ఊహలను

ఊరిస్తా


శిరసులోకి

దిగుతా

భావమును

బయటకుతీస్తా


తలలో

వెదుకుతా

అక్షరాలను

ఏరుకుంటా


బుర్రకు

పనిపెడతా

పదాలను

పట్టుకుంటా


వెంట్రుకలను

పీకుకుంటా

పంక్తులును

అమరుస్తా


చెమటను

కారుస్తా

చరణాలు

పేరుస్తా


కలమును

పడతా

కాగితాలను

నింపుతా


మదిని

చిలుకుతా

కవితను

కూరుస్తా


పాఠకులకు

పంపుతా

పరమానందము

పంచుతా


కైతలు

చదివిస్తా

మనసులు

మురిపిస్తా


పువ్వులు

పూయిస్తా

పరిమళాలు

చల్లిస్తా


నవ్వులు

చిందిస్తా

మోములు

వెలిగిస్తా


అందాలు

చూపిస్తా

ఆనందం

కలిగిస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్య


నగరం


Comments

Popular posts from this blog