ఆదేశంలో ఎన్నికలచిత్రము
ఆదేశంలో
త్వరలో
వస్తున్నాయి
ఎన్నికలు
అన్నీచూచి
ఆలోచించి
వేయండి
మీవోట్లని
గొర్రెలు
బర్రెలు
అనుకుంటున్నారు
ఓటరుమహాశయులను
నక్కలు
ఊళలు
వేస్తున్నాయి
వినవద్దు
గాడిదలు
ఓండ్రింపులు
పెడుతున్నాయి
పట్టించుకోవద్దు
పాములు
బుసలుకొట్టి
నృత్యముచేస్తున్నాయి
పరికించవద్దు
తోడేల్లు
నోర్లుతెరచి
కూతలుకూస్తున్నాయి
లెక్కచేయవద్దు
పులులు
గాండ్రింపులు
చేస్తున్నాయి
ఆలకించవద్దు
ఎన్నికలలో
ఎట్లాగయినా
గెలవాలని
చూస్తున్నారు
అవినీతి
ధనమును
పంచాలని
చూస్తున్నారు
అమలుచేయలేని
లెక్కలేని
హామీలను
ఇస్తున్నారు
మద్యాన్ని
అందించి
గెలవాలని
ప్రయత్నిస్తున్నారు
మత్తులోకి
ప్రజలుని
దించాలని
చూస్తున్నారు
తియ్యని
మాటలను
అమాయకులపై
సంధిస్తున్నారు
భ్రమలు
కలిపించి
మోసంచెయ్యాలని
పాటుపడుతున్నారు
గాలంవేసి
వోటర్లను
వలలోవేసుకోవాలని
చూస్తున్నారు
కులకుంపట్లను
రగిలుస్తున్నారు
మతద్వేషాలను
ముట్టిస్తున్నారు
ఓటరూ
తొందరపడకు
ఓటరూ
అమ్ముడుపోకు
ఓటర్లు
పారాహుషారు
నాటకాలు
గమనించు
అమీతుమీ
తేల్చుకోవాలి
ఆచీతూచీ
వోట్లెయ్యాలి
విజయం
ప్రజలకుదక్కాలి
అపజయం
వినాయకులపాలుకావాలి
జై జై
ఓటరూ
జయహో
ఓటరూ
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment