గడ్డిపువ్వును
నేను
గడ్డిపువ్వును
గరికపూవును
తృణపుష్పమును
నేను
బుజ్జిపువ్వును
పొట్టిపువ్వును
చిట్టిపువ్వును
చిన్నపువ్వునని
చిన్నబుచ్చకు
నొచ్చుకొందునునేను
నన్నుతిట్టుకొందును
పనికిరానిదని
ప్రేలాపించకు
బాధపడుదును
కుమిలిపోదును
తృణపుష్పమని
తూలనాడకు
తలచిందుకుందును
తల్లడిల్లిపోవుదును
పిట్టకొంచెమైనను
కూతఘనమను
మురిసిపోవుదును
మెరిసిపోవుదును
తెరువరులకు
అందాలుచూపిస్తాను
అలసటలేకుండా
ముందుకునడిపిస్తాను
తొక్కకుండావదిలితే
తృప్తిజెందుతాను
ధన్యుడననుకుంటాను
ధన్యవాదాలుచెబుతాను
దారినవెళ్ళేవారిని
పలుకరిస్తాను
వారికిశుభంచేకూరాలని
కోరుకుంటాను
దయచేసి కోయవద్దు
గోర్లతో గిచ్చవద్దు
చేతులతో నలపవద్దు
చెత్తబుట్టలో పదవేయవద్దు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment