కవనతతంగాలు


అనువైనచోటుకు

స్వయంగా వెళ్తా

అనుభూతులను

శిరానికి ఎక్కిస్తా


అందాలకడకు

కళ్ళను పంపుతా

కాంచినదృశ్యాలను

బుర్రలో భద్రపరుస్తా


అవగాహనలేనితావుకు

మనసును పొమ్మంటా

తట్టినవిషయాలను

శిరస్సులో నిలువచేస్తా


అవలోకించవలసిననెలవుకు

చెవులను సాగనంపుతా

విన్నకబుర్లును

మస్తిష్కంలో దాచుకుంటా


రహస్యస్థావరాలకు

గూఢచారులను వెళ్ళిరమ్మంటా

వివరించినవిశేషాలను

నెత్తిలో పెట్టుకుంటా


మనసును

చిలుకుతా

వెన్నను

బయటకుతీస్తా


అక్షరాలకు

అలుకుతా

పదాలకు

పులుముతా


కవనము

కొనసాగిస్తా

కైతలను

కూరుస్తా


పుటలకు

ఎక్కిస్తా

పుస్తకాలు

కుట్టిస్తా


పాఠకులకు

పంపుతా

పరవశముము

పంచుతా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog