ఓ మనిషీ!

(ప్రబోధగేయం)


కుదరదు కుదరదు కుదరదు

కూర్చొని తినటము కుదరదు

వంటిని వంచక కుదరదు            ||కుద||


తప్పదు తప్పదు తప్పదు

కాయా కష్టము తప్పదు

గడనా చేయక తప్పదు


వలదు వలదు వలదు

సోమరి బతుకు వలదు

లేకిగ తిరుగుట వలదు              ||కుద||


కూడదు కూడదు కూడదు

చోరీ  చేయుట కూడదు

దోపిడీ చేయుట కూడదు


వేడొద్దు వేడొద్దు వేడొద్దు

దానా ధర్మాలు వేడొద్దు

దయా దాక్షిణ్యాలు వేడొద్దు           ||కుద||


వద్దూ వద్దూ వద్దూ

వెధవా చేష్టలు వద్దూ

వెర్రీ వేషాలు వద్దూ


కార్చొద్దు కార్చొద్దు కార్చొద్దు

మొసలి కన్నీరు కార్చొద్దు

చీటిమాటికి కన్నీరు కార్చొద్దు         ||కుద||


వెళ్ళొద్దు వెళ్ళొదు వెళ్ళొద్దు

డాంబికాలకు వెళ్ళొద్దు

కొట్లాటలకు వెళ్ళొద్దు


తిరగొద్దు తిరగొద్దు తిరగొద్దు

అచ్చేసిన ఆబోతులా తిరగొద్దు

అవసరము లేకుండా తిరగొద్దు        ||కుద||


త్రాగొద్దు త్రాగుద్దు త్రాగొద్దు

కల్లు సారాయీలు త్రాగొద్దు

బీరు బ్రాందీలను త్రాగొద్దు


బ్రతుకు బ్రతుకు బ్రతుకు

నీతిమంతుడిలాగా బ్రతుకు

నిజాయితీపరుడిలా బ్రతుకు          ||కుద||


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog