మా చిన్నిక్రిష్ణా!
మా ఇంటి
దీపమా!
మా కంటి
వెలుగా!
మా వంశ
ఉద్ధారకుడా!
మా కలల
సాకారికుడా!
మా వరాల
బిడ్డా!
మా బంగారు
బొమ్మా!
వినాయాకునికి
మ్రొక్కరా
ఓనమాలుని
మొదలెట్టరా
వాణీదేవిని
పూజించరా
విద్యనిమ్మని
ప్రార్ధించరా
పలకను
పట్టరా
పాఠశాలకు
వెళ్ళరా
అ ఆలు
నేర్వరా
అమ్మానాన్నల
అలరించరా
అమ్మ ఆవులు
చదవరా
అచ్చ తెలుగును
పలుకరా
గురువులకు
నమస్కరించరా
స్నేహితులకు
తోడ్పాటందించరా
అచ్చులతో
అక్షరాలారంభించరా
హల్లులతో
వర్ణమాలనుముగించరా
గుణింతాలు
దిద్దరా
స్పష్టముగ
ఉచ్చరించరా
పద్యాలు
పఠించరా
గద్యాలు
వచించరా
చిరునవ్వులు
చిందరా
ముద్దుమాటలు
వినిపించరా
మంచిబాటన
నడవరా
గొప్పస్థితికి
చేరుకోరా
కుటుంబగౌరవాన్ని
కాపాడరా
పేరుప్రఖ్యాతులుని
పొందరా
ఉత్తమపౌరుడిగా
ఎదగరా
ఆదర్శప్రాయుడిగా
నిలువరా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment