వానకురిసినరోజు


వచ్చింది

వానాకాలము

తెరిచింది

నేలనోరును


లేచాయి

కారుమబ్బులు

వచ్చాయి

చేతికిగొడుగులు


పడ్డాయి

చిటపటచినుకులు

పారాయి

వాగులువంకలు


ఉరిమాయి

నింగిన ఉరుములు

మెరిశాయి

గగనాన మెరుపులు


కూడారు

బయటనపిల్లలు

వేశారు

కాగితపుపడవులు


ఆడారు

వీధులందు

పాడారు

వానపాటలు


నిండాయి

చెరువులుకుంటలు

అరిచాయి

బెకబెకాకప్పలు


వీచాయి

చల్లనిగాలులు

ఇచ్చాయి

సుఖసంతోషాలు


ఇచ్చింది

వ్రాయుటకువిషయం

కుదిరింది

కమ్మనికవనం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog