వెలుగులు చిమ్ముతా!
దీపాలు
వెలిగిస్తా
చీకట్లు
తొలిగిస్తా
మోములు
వెలిగిస్తా
నవ్వులు
చిందిస్తా
కళ్ళను
వెలిగిస్తా
అందాలు
చూపిస్తా
వీధులు
వెలిగిస్తా
రాత్రులను
పగలుచేస్తా
దారులు
వెలిగిస్తా
గమ్యమువైపు
నడిపిస్తా
దివిటీలు
వెలిగిస్తా
దేవతలను
ఊరేగిస్తా
జీవితాలు
వెలిగిస్తా
ఆనందాలు
అందిస్తా
కొవ్వొత్తులు
వెలిగిస్తా
నిరసనలు
తెలియజేస్తా
అవ్వాయిచువ్వలు
వెలిగిస్తా
ఆకాశమందు
ప్రేలుస్తా
మనసులు
వెలిగిస్తా
ఆలోచనలు
పారిస్తా
అక్షరాలు
వెలిగిస్తా
అఙ్ఞానము
తరిమేస్తా
కాగితాలు
వెలిగిస్తా
కవితలను
చదివిస్తా
కవితలు
వెలిగిస్తా
కమ్మదనాలు
కూర్చుతా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment