ఓ ప్రియా!
నీ చూపు
తాకింది
నా మేను
మురిసింది
నీ రూపు
సోకింది
నా మోము
వెలిగింది
నీ కళ్ళు
మెరిసాయి
నా కళ్ళు
కులికాయి
నీ నవ్వు
చూశాను
నేను నన్ను
మరిచాను
నీ పలుకు
విన్నాను
నా పెదవి
విప్పాను
నీ సొగసు
పిలిచింది
నా మనసు
కులికింది
నీ స్పర్శ
తగిలింది
నా తనువు
తరించింది
నీ తళుకు
అదిరింది
నాకు వలపు
పుట్టింది
నీ చేయి
పడతాను
నీకు తాళి
కడతాను
నీ తోడుగ
ఉంటాను
నీ వాడిని
అవుతాను
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment