కవితాచేష్టలు

(కవితను నేను)


తలచితే

ప్రత్యక్షమవుతా

తిన్నగా

వ్యవహారంలోకిదించుతా


అడిగితే

విషయాన్నిస్తా

అందంగా

విరచించమంటా


కావాలంటే

మనసునుతడతా

కమ్మగా

కొత్తతరహాలోకూర్చమంటా


పిలిస్తే

పక్కకొస్తా

పుటలపై

పేర్చమంటా


అల్లితే

ఆనందిస్తా

అక్షరాలనై

అలరిస్తా


పొగిడితే

పరవశిస్తా

పదాలనై

పేజీలకెక్కుతా


కోరితే

కలలోకొస్తా

కవ్వించి

కలమునుపట్టిస్తా


ప్రేమిస్తే

పొంగిపోతా

ప్రతిదినము

పనిపెడతా


సోకుచేస్తానంటే

సమ్మతిస్తా

సోయగాలతో

సందడిచేస్తా


పంపితే

పయనిస్తా

పత్రికలలోసమూహాలలో

పాఠకులకుచేరువవుతా


ప్రచురిస్తే

పుస్తకాలకెక్కుతా

ప్రతులనై

పలువురునిచేరుతా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog