కవులరాతలు


రాతలు

అమృతముకురిపించాలి


కవితలు

చెరకురసముత్రాగించాలి


అక్షరాలు

పనసతొనలనుతలపించాలి


పదాలు

మధురమామిడిపంద్లవ్వాలి


భావాలు

తేనెచుక్కలనుచిందించాలి


కలము

ఎలనీరునుసేవింపజేయాలి


హస్తవ్రాతలు

రసగుల్లాలనువడ్డించాలి


కవనము

ద్రాక్షారసముచేతికివ్వాలి


కవిత్వము

పవిత్రగంగాజలమునందించాలి 


మాటలు

నోర్లలోచాకులెట్లులాగానానాలి


పలుకులు

పాఠకులమదులనుకరిగించాలి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog