కమ్మని కవితకోసం
అక్షరాలను
పోగుచేశా
పొత్తమందు
పేర్చేశా
పూలరంగులు
పులిమా
పరిమళాలు
పైనచల్లా
వానచినుకులు
కుమ్మరించా
కల్మషాలను
కడిగివేశా
సూర్యకాంతులు
వెదజల్లా
వెలుగులను
ప్రతిబింబించా
చిరునవ్వులు
చిందించా
ఎగ్గుసిగ్గులు
ప్రదర్శింపజేశా
వెన్నెలను
కురిపించా
వయ్యారాలు
ఒలికించా
తేనెను
చల్లా
సీతాకోకచిలుకలను
ఎగిరించా
సూదంటురాళ్ళు
తగిలించా
తలలకు
అంటించా
బాలను
చేశా
ముద్దుమాటలు
పలికించా
కన్యను
చేశా
సమ్మోహనాస్త్రము
సంధింపజేశా
నింగిన
ఎగరేశా
హరివిల్లుపైన
ఊయలనూగించా
అందంగా
తీర్చిదిద్దా
అంతరంగాలకు
తాకేలాచేశా
కవితను
చేశా
కమ్మదనాలు
కురిపించా
కైతను
క్రోలండి
కవిపేరును
తలచండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment