సాహితీసేద్యం
సేద్యం
సాగుతుంది
స్వేదం
చిందుతుంది
ఆలోచనలు
చిగురించాయి
మొలకలు
పల్లవించాయి
అక్షరాలు
అల్లుకున్నాయి
మొక్కలు
మొగ్గలేశాయి
పదాలు
ప్రాకాయి
పువ్వులు
పూచాయి
కైతలు
జాలువారాయి
నీరు
కాలవనపారాయి
పంటలు
పండాయి
ఇండ్లకు
చేరాయి
విందుకు
ఆహ్వానం
వేడుకకు
సిద్ధం
వంటకాలు
తయారు
వడ్డనలు
మొదలు
కడుపులు
నింపుకోండి
పరవశాలు
పంచుకోండి
చప్పట్లు
కొట్టండి
ముచ్చట్లు
చెప్పండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment