తెల్లారిందో లేదో.....
(ప్రభాతవేళ-కవనప్రక్రియ)
కాగితం
కళ్ళముందుకొచ్చింది
కవిత్వం
కూర్చమనికోరింది
కలం
చేతపట్టమంది
కవనం
సాగించమంది
అక్షరాలు
ఎగురుకుంటూవచ్చాయి
పుటలపైన
పేర్చమనిప్రార్ధించాయి
పదములు
పరుగెత్తుకుంటూవచ్చాయి
పసందుగా
ప్రయోగించమనికోరాయి
తలపులు
తలలోతట్టాయి
పేజీలపైన
పొంగిపొర్లుతామన్నాయి
అందాలు
అగుపించాయి
ఆనందాలు
అందించాయి
కిరణకాంతులు
ప్రసరించాయి
కవనకాంతులు
ప్రకాశించాయి
ఇంటివాకిల్ల్లు
తెరచుకొని కిరణాలనుపిలిచాయి
మనసుతలుపులు
తెరచుకొని కవితలనుపిలిచాయి
కాగితాలమీద
కలం కదిలింది
కమ్మదనాల
కైత పుట్టింది
విషయము
వెనుకకువెళ్ళండి
కవిత్వము
ముందుకుకదలండి
చూడండి
చదవండి
సంతసించండి
సహచరులతోపంచుకోండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవిత
కవ్విస్తుంది
సాహితి
సహకరిస్తుంది
వాణీదేవి
కరుణిస్తుంది
పలుకులను
పారిస్తుంది
పత్రికలు
ప్రచురిస్తున్నాయి
ప్రసారమాధ్యమాలు
పలువురికిపంపుతున్నాయి
పాఠకులు
ఇష్టపడుతున్నారు
విమర్శకులు
మెచ్చుకుంటున్నారు
అదృష్టంగా
భావిస్తున్నా
ఆనందంలో
మునిగిపోతున్నా
సాహిత్యాభిలాషులకు
స్వాగతాలు
ప్రోత్సాహించేవారలకు
ధన్యవాదాలు

Comments
Post a Comment