ఆమెకోసం

(దయచూపనిచెలి)


రమ్మని పిలిచా

కాచుకొని ఉన్నా

కళ్ళారా చూడాలని

మనసారా మాట్లాడాలని


పూలు తీసుకొనివచ్చా

కొప్పులో తురుమాలని

చేతికి ఇవ్వాలని

మత్తులో ముంచాలని


చేతులు కలిపి

మనసులు కలిపి

మురిసిపోవాలని

ఎదురుచూస్తున్నా


మెత్తటి పరుపుమీద

చక్కని దుప్పటికప్పి

కూర్చోపెట్టాలని

కుతూహలపరచాలని చూస్తున్నా


కళ్ళను పూర్తిగాతెరచి

చుట్టూ పరికిస్తున్నా

తప్పక వస్తుందని

మాట నిలుపుకుంటుందని


అందాన్ని క్రోలుకోవాలని

ఆనందాన్ని పొందాలని

ఆశను తీర్చుకోవాలని

ఆరాటపడుతున్నా


వేషంతో ఆకర్షించాలని

మాటలతో మురిపించాలని

చేతలతో సంతసపట్టాలని

చప్పుడుచేయకుండా చూస్తున్నా


గుసగుసలాడాలని

కబుర్లలోముంచాలని

చెవులలో ఊదాలని

మనసుపడి చూస్తున్నా


ఆమెకు

దయకలుగలేదు

నాకు 

అదృష్టంచిక్కలేదు


కళ్ళ

కోరికతీరలేదు

పెదవుల

దప్పికతీరలేదు


చెవులకు

శ్రావ్యతదొరకలేదు

తనువుకు

తోడుదొరకలేదు


కడుపు

నిండలేదు

మనసు

మురవలేదు


మోము

వెలుగలేదు

నవ్వు

చిక్కలేదు


తృప్తి

కలగలేదు

తనివి

తీరలేదు


అయినా

రేపటికోసంచూస్తా

మనసుకు 

సర్దిచెప్పిచూస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం





Comments

Popular posts from this blog