సుద్దులపర్వము
నడిచేవారిని
నిలిపేయకు
పరిగెత్తేవారిని
పడద్రోయకు
కూర్చున్నవారిని
కదపకు
పడుకున్నవారిని
లేపకు
వ్రాసేవారిని
ఆపకు
చదివేవారిని
నిలుపకు
తినేవారికూటిని
తన్నుకొనిపోకు
కూసేవారికూతలకి
వత్తాసుపలుకకు
పనిచేసేవాళ్ళను
కట్టేయకు
సోమరిపోతులను
ప్రోత్సహించకు
మంచివారిని
మోసగించకు
చెడ్డవారికి
చేయూతనివ్వకు
మతఛాందసులను
మూలపెట్టు
కులాలగోడలను
కూలగొట్టు
మానవత్వమును
పెంపొందించు
క్రూరత్వమును
ఖండించు
వక్రబుద్ధులను
మానిపించు
చిల్లరవేషాలను
చితకకొట్టు
కళ్ళల్లో
కారముచల్లకు
చెవుల్లో
దూదినిదోపకు
చేతులను
కట్టేయకు
కాళ్ళను
బంధించకు
మూతులకు
తాళాలువేయకు
ముక్కులకు
అడ్డాలుపెట్టకు
మంచిని
మన్నించు
చెడుని
తగలబెట్టు
ప్రేమను
పెంచు
ద్వేషాన్ని
తెంచు
స్వేచ్ఛను
ఇవ్వు
సంకెళ్ళను
తొలగించు
సుద్దులు
గుర్తుంచుకోండి
బుద్ధులు
మార్చుకోండి
సమాజానికి
సాయపడండి
లోకకళ్యాణానికి
పాటుపడండి
చెప్పినమాటలు
వినండి
సత్కార్యములను
చెయ్యండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment