ఒయ్యారి
వగలమారి
వగలుచూపుతుంటే
మడికట్టుకొనికూర్చుంటానా
మెదలకుండాయుంటానా
చక్కనిచుక్క
పిలుస్తుంటే
పలకరించకుండాయుంటానా
ప్రక్కకుపోకుండాయుంటానా
లేతబుగ్గలు
సిగ్గులొలుకుతుంటే
గులాబీలనుకోనా
చేతితోతడమనా
పువ్వులా
పరిమళంవీస్తుంటే
పీల్చనా
పులకరించనా
గాజులను
గలగలామ్రొగిస్తుంటే
తలతిప్పనా
అందాలుకననా
కోకిలలా
రాగంతీస్తుంటే
చెవులుమూసుకుంటానా
వినకుండాయుంటానా
హంసలా
అడుగులేస్తుంటే
పరికించనా
పరవశించనా
నెమలిలా
పురివిప్పితే
నాట్యంచూడనా
నేత్రాలప్పగించనా
మోము
నవ్వులుచిందుతుంటే
అటేచూడనా
ఆనందంపొందనా
జాబిలిలా
వెన్నెలవిసురుతుంటే
వేడుకచేసుకోనా
వినోదంపొందనా
తారలా
తళతళలాడుతుంటే
వీక్షించనా
విస్తుపోనా
చూపులతో
వలవిసురుతుంటే
చిక్కనా
దొరకనా
కళ్ళతో
ప్రేమజల్లులుకురిపిస్తుంటే
తడవనా
ముద్దయిపోనా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment