కాలచక్రమా!


కదులుకదులు కాలమా

ముందుకుకదులు కాలమా

నిలిచిపోకు కాలమా

నిదురబోకు కాలమా          ||కదులు||


అందాలను చూపిస్తూ

ఆనందాలను కూరుస్తూ

కేరింతలు కొట్టిస్తూ

చిందులు వేయిస్తూ             ||కదులు||


విజయాలను దక్కిస్తూ

లక్ష్యాలను చేరుస్తూ

విలువలను పెంచుతూ

అక్రమాలను త్రుంచుతూ        ||కదులు||


విద్యాబుద్ధులు నేర్పుతూ

విఙ్ఞానాన్ని పెంచుతూ

సన్మార్గాన నడుపుతూ

వెలుగులు చిమ్ముతూ            ||కదులు||


కష్టాలను తొలగిస్తూ

సుఖాలను కలిగిస్తూ

చిరునవ్వులు చిందిస్తూ

మోములను వెలిగిస్తూ           ||కదులు||


ఊహలను ఊరిస్తూ

ఉల్లాసము కలిగిస్తూ

మమతల్లో ముంచుతూ 

మదులను మురిపిస్తూ           ||కదులు||


రేయిపగలు మారుస్తూ

రోజులను గడుపుతూ

ఋతువులను మారుస్తూ

వత్సరాలు గడుపుతూ          ||కదులు||


కోకిలలా కూస్తూ

నెమలిలా నర్తిస్తూ

చిలుకలా పలుకుతూ

చిన్నారులలా లాలిస్తూ         ||కదులు||


పువ్వులను పూయిస్తూ

పొంకాలను చూపిస్తూ

పరిమళాలు చల్లుతూ

పరిసరాలు కాపాడుతూ       ||కదులు||


భవితకు భరోసానిస్తూ

నవ్యతను చేకూరుస్తూ

నదిలోని నీటిజాలులా

కడలిలోని కెరటాలులా      ||కదులు||


గుండ్లపల్లి రాజేంద్రపసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog