ఎంత బాగుండు?


ఉరిమేవారికి

అడ్డుపడి

నోరుమూపిస్తే

ఎంత బాగుండు


తరిమేవారికి

ఎదురుపడి

కాళ్ళుకట్టేస్తే

ఎంత బాగుండు


కరిసేవారికి

బుద్ధిచెప్పి

పళ్ళూడకొడితే

ఎంత బాగుండు


కుమ్మేవారికి

ఎదురునిలిచి

కట్టడిచేస్తే

ఎంత బాగుండు


కారుకూతలుకూసేవారి

చెంతకెళ్ళి

మూతికితాళంవేస్తే

ఎంత బాగుండు


క్రిందకుపడదోచేవారి

ప్రక్కకెళ్ళి

చేతులకుబేడీలేస్తే

ఎంత బాగుండు


తన్నేవారిని

నివారించి

కాళ్ళువిరగకొడితే

ఎంత బాగుండు


నిందించేవారిని

నిరోధించి

మూగవాడినిచేస్తే

ఎంత బాగుండు


తిట్టేవారిని

తృణీకరించి

నాలుకకోసేస్తే

ఎంత బాగుండు


నిప్పులుకక్కేవారిని

చుట్టుముట్టి

నీటినికుమ్మరిస్తే

ఎంత బాగుండు


పండంటికాపురాల్లో

కుంపటిపెట్టేవారికి

బడితపూజచేస్తే

ఎంత బాగుండు


కళ్ళల్లో

నిప్పులుపోసుకునేవారి

కన్నుల్లోకారంచల్లితే

ఎంత బాగుండు


సంఘములోని

కుళ్ళును

సమూలంగాకడిగిపారేస్తే

ఎంత బాగుండు


సమాజవికాసానికి

శ్రమించి

సర్వులూసహాయపడితే

ఎంత బాగుండు


నాకృషిలో

ముందుకొచ్చి

అందరూసహకరిస్తే

ఎంత బాగుండు


బాగుబాగు

ఈకవిత

బహుబాగుయంటే

ఎంత బాగుండు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog