జై తెలుగు
తెలుగుమాటలు
పుష్పాలయి
పరిమళాలు
వెదజల్లాలి
తెలుగక్షరాలు
దీపాలయి
వెలుగులు
చిమ్మాలి
తెలుగుపదాలు
తేటనీరయి
పెదవులనుండి
ప్రవహించాలి
తెలుగుపలుకులు
తేనెచుక్కలయి
తియ్యదనాలు
చిందాలి
తెలుగుకవితలు
సుందరమయి
మదులను
మురిపించాలి
తెలుగుపాటలు
శ్రావ్యమయి
వీనులకు
విందునివ్వాలి
తెలుగుమోములు
చంద్రవదనాలయి
వెన్నెలను
విరజిమ్మాలి
తెలుగు
లెస్సయి
దేశవిదేశాల
వ్యాపించాలి
తెలుగుతల్లి
మాతృమూర్తయి
పిల్లలను
పరిరక్షించాలి
తెలుగుభాష
అమృతమయి
తెలుగుజాతిని
అమరంచెయ్యాలి
తెలుగుసీమ
స్వర్గమయి
సర్వసుఖాలకు
నిలయంకావాలి
జై తెలుగు
జై జై తెలుగు
జయహో తెలుగు
జయహో జయహో తెలుగు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment