స్వేచ్ఛావిహంగం
చేతికి
అడ్డంలేదు
నోటికి
అడ్డంలేదు
పనికి
అడ్డంలేదు
పలుకలకి
అడ్డంలేదు
అందానికి
పరిమితులులేవు
ఆనందానికి
పరిమితులులేవు
చూపులకి
పరిమితులులేవు
ఆస్వాదనకి
పరిమితులులేవు
కవికి
కట్టుబాట్లులేవు
కవితలకి
కట్టుబాట్లులేవు
విషయాలకి
కట్టుబాట్లులేదు
వివరణలకి
కట్టుబాట్లులేవు
కలానికి
బంధాలులేవు
కల్పనలకి
బంధాలులేవు
అక్షరాలకు
బంధాలులేవు
పదాలకి
బంధాలులేవు
మనసులకి
సంకెళ్ళులేవు
మనుషులకి
సంకెళ్ళులేవు
ఆలోచించటానికి
సంకేళ్ళులేవు
అమలుచేయాటానికి
సంకెళ్ళులేవు
స్వేచ్ఛగా
ఆలోచించండి
స్వేచ్ఛగా
అవలోకించండి
స్వేచ్ఛగా
తిరగండి
స్వేచ్ఛగా
బ్రతకండి
పక్షిలా
గాలిలో ఎగరండి
మబ్బులా
ఆకాశంలో తేలండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment