తెరచిచూడు
కిటికీలు తెరువు
తలుపులు తెరువు
గాలిని పిలువు
కాంతిని రమ్మను
ఆరోగ్యంగా జీవించు
కళ్ళు తెరువు
చెవులు తెరువు
అందాలను చూడు
శ్రావ్యతను విను
సంతోషాలను పొందు
నోటిని తెరువు
పెదవులు కదిలించు
తేనెపలుకులు చిందు
తియ్యదనాన్ని పంచు
పేరుప్రఖ్యాతులు పొందు
బీరువా తెరువు
పర్సును తెరువు
డబ్బులు తియ్యి
అవసరమైనవి కొను
ఆనందంగా బ్రతుకు
గుప్పెట తెరువు
రహస్యాలు చూడు
తెలుసుకో నిజము
మార్చుకో తీరు
సరిదిద్దుకో కాపురము
పుస్తకాలు తెరువు
పుటలు తిప్పు
ఙ్ఞానాన్ని పొందు
మదులను వెలిగించు
చైతన్యవంతుడివి అగు
మనసు తెరువు
మెదడును వాడు
తలపులు పారించు
అనుభూతులు పొందు
కమ్మనికవితలను కూర్చు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment