శుచిశుభ్రతలు


స్వచ్ఛనీటితో

శరీరాలు శుద్ధమవుతాయి

నీతినిజాయితితో

మనసులు పరిశుభ్రమవుతాయి


సుపలుకలతో

నోర్లు శుద్ధమవుతాయి

శ్రావ్యశబ్దాలతో

చెవులు పరిశుభ్రమవుతాయి


తోమటంతో

పళ్ళు శుభ్రమవుతాయి

ఉతకటంతో

బట్టలు పరిశుభ్రమవుతాయి


ప్రేమతో

గుండెలు శుభ్రమవుతాయి

స్నేహంతో

హృదయాలు పరిశుభ్రమవుతాయి


సత్ప్రవర్తనతో

మనుషులు శుద్ధమవుతారు

అన్యోన్యంతో

దంపతులు పరిశుద్ధమవుతారు


అందంతో

చూపులు శుద్ధమవుతాయి

ఆనందంతో

మోములు  పరిశుభ్రమవుతాయి


కమ్మనిరచనలతో

కవులు శుద్ధమవుతారు

ప్రియపఠనంతో

పాఠకులు పరిశుభ్రమవుతారు


శుచిగా

బ్రతకండి

ఆరోగ్యంగా

జీవించండి


శుభ్రతను

పాటించండి

శ్రేయాలను

పొందండి


సుద్దమైన

జీవనం

సుఖమైన

జీవితం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog