సంక్రాంతి
సంక్రాంతి వచ్చింది
అనందాలు పంచింది
హరిదాసులను తెచ్చింది
గంగిరెద్దులను తిప్పింది
సంక్రాంతి పిలిచింది
సంబరాలు చెయ్యమంది
సంక్రాంతి ప్రొద్దున్నెలేపింది
భోగిమంటలు వేయించింది
సంక్రాంతి రేగిపండ్లుతెప్పించింది
పిల్లలతలలపై పోయించింది
సంక్రాంతి తినమంది
అరిసెలను ఆరగింపజేసింది
సంక్రాంతి వేసుకోమంది
కొత్తబట్టలను ధరింపజేసింది
సంక్రాంతి ఆడమంది
కోడిపందాలు కాయించింది
సంక్రాంతి గాలిపటాలుకొనిపించింది
గాలిలో ఎత్తుగానెగురింపజేసింది
సంక్రాంతి వ్రాయించింది
కమ్మనికవితను కూర్పించింది
సంక్రాంతి చెప్పించింది
శుభాకాంక్షలు తెలియజేయించింది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
💐💐💐💐🌷🌷🌷🌷అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు🌷🌷🌷🌷💐💐💐💐
Comments
Post a Comment