కవిత్వం


కవిత్వం

పాలతోపాటు

పొంగుతుంది


కవిత్వం

వానతోపాటు

కురుస్తుంది


కవిత్వం

రవికిరణాలతోపాటు

ప్రకాశిస్తుంది


కవిత్వం

వెన్నెలతోపాటు

హాయిగొలుపుతుంది


కవిత్వం

గాలితోపాటు

వీస్తుంది


కవిత్వం

పువ్వులతోపాటు

పరిమళాలుచల్లుతుంది


కవిత్వం

ఊహలతోపాటు

ఊరుతుంది


కవిత్వం

అందంతోపాటు

ఆకర్షిస్తుంది


కవిత్వం

ఆనందంతోపాటు

కలసికదులుతుంది


కవిత్వం

నదితోపాటు

ప్రవహిస్తుంది


కవిత్వం

కడలికెరటాలతోపాటు

ఎగిసిపడుతుంది


కవిత్వం

కాలంతోపాటు

ముందుకుసాగుతుంది


కవిత్వం

తెలుగుతోపాటు

తేనెచుక్కలుచల్లుతుంది


కవిత్వం

కవితోపాటు

పయనిస్తుంది


కవిత్వం

కళ్ళను

కట్టేస్తుంది


కవిత్వం

మదులను

ముట్టేస్తుంది


కవిత్వాన్ని

అందరితోపాటు

స్వాగతిద్దాం


కవిత్వాన్ని

చదువుదాం

కవులనుప్రోత్సహిద్దాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog