అందచందాలు
ఒయ్యారాలు
సయ్యాటలకు రమ్మంటున్నాయి
చక్కదనాలు
చిందులు త్రొక్కుదామంటున్నాయి
అందాలు
ఆనందాలను పొందమంటున్నాయి
పొంకాలు
పరిహాసాలకు పిలుస్తున్నాయి
కమ్మదనాలు
కళ్ళను కట్టిపడేస్తున్నాయి
సొంపులు
వంపులు చూపుతున్నాయి
ఇంపులు
కోర్కెలు లేపుతున్నాయి
సోకులు
సరదాలు చేస్తున్నాయి
సౌందర్యాలు
సంబరాలకు ఆహ్వానిస్తున్నాయి
సోయగాలు
సరసాలకు స్వాగతిస్తున్నాయి
శోభలు
సంతోషాలను చేకూరుస్తున్నాయి
సొబగులు
సందడులు చేస్తున్నాయి
బెళుకులు
తళుకులు చిమ్ముతున్నాయి
హొయలు
హృదిని ముట్టుతున్నాయి
ఆహా!
అందమే మధువు
అందమే వధువు
అందమే అద్భుతము
అందమే ఆశ్చర్యము
అందమే అపరూపము
అందమే ఆవశ్యకము
అందమే అలంకారము
అందమే రూపకము
అందమే ఉపమానము
అందమే ఉపమేయము
అందమే గమ్యము
అందమే జీవితము
అందమే భాగ్యము
అందమే ఆనందము
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment