ఏలనో?


తలపులు

తన్నుకొస్తున్నాయి


ఊహలు

ఊరుతున్నాయి


ఆలోచనలు

ఆవహిస్తున్నాయి


యోచనలు

వెంటపడుతున్నాయి


భావాలు

బయటకొస్తున్నాయి


మెదడు

ఉడుకుతుంది


మనసు

మరుగుతుంది


మనోచిత్రం

తయారవుతుంది


కలం

చేతికొస్తుంది


కాగితం

ముందుకొస్తుంది

 

కవిత

పుట్టకొస్తుంది


సాహితి

సంబరపడుతుంది


వాణీదేవికి

వందనాలు


పాఠకులకు

ధన్యవాదాలు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog