అందాల ఆకాశం
ఆకాశాన్ని పిలిచా
ఉరుములు ఉరిమింది
మెరుపులు మెరిసింది
అందాలు చూపింది
మేఘాలను పిలిచా
చుక్కలు రాల్చాయి
చిందులు వేయించాయి
సంతసం కలిగించాయి
జాబిలిని పిలిచా
వెన్నెల చల్లింది
కోరికలు లేపింది
ముచ్చట పరిచింది
తారకలను పిలిచా
తళతళామెరిసాయి
ఊసులుచెప్పాయి
ఉత్సాహపరిచాయి
సూర్యుని పిలిచా
తూర్పున ఉదయించాడు
అరుణకిరణాలు వెదజల్లాడు
జగాన్ని జాగృతపరిచాడు
పక్షులను పిలిచా
రెక్కలనువిప్పాయి
రెపరెపలాడాయి
కోలాహలంచేశాయి
గాలిని పిలిచా
ముఖాన్ని తాకాడు
ముక్కుల్లో దూరాడు
చెట్లను ఊపాడు
కిరణాలను పిలిచా
కాంతులు వెదజల్లాయి
చీకటిని తరిమాయి
మనసును వెలిగించాయి
ఆకాశము
అజస్రము
అనంతము
అనన్యము
ఆకాశము
అద్భుతము
అందాలమయము
ఆనందాలహేతువు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment