కవీశ్వరా!
అందమైన
కవితలు
అల్లు
చదువరులకు చేర్చు
కమ్మనైన
కవితలు
కూర్చు
కళ్ళను కట్టిపడవెయ్యి
మధురమైన
కవితలు
పాడు
శ్రోతలను తృప్తిపరచు
అద్భుతమైన
కవితలు
అక్షరాలలోపెట్టు
అందరినీ అలరించు
తీయనైన
కవితలు
వడ్డించు
కడుపులను నింపు
పరిమళభరితమైన
కవితలు
చల్లు
ఆస్వాదితులను ఆహ్లాదపరచు
అమృతతుల్యమైన
కవితలు
కురిపించు
పాఠకులపెదవులకు అందించు
రమ్యమైన
కవితలు
హరివిల్లులాదిద్దు
సప్తవర్ణాలద్ది సంతసపెట్టు
విచిత్రమైన
కవితలు
చిత్రించు
వీక్షకులను వేడుకపరచు
నాణ్యమైన
కవితలు
పుటలకెక్కించు
పాఠకులను మెప్పించు
చక్కనైన
కవితలు
కలంతోచెక్కు
కళాకారుడిగా స్థిరపడు
హృద్యమైన
కవితలు
మంచిమాటలలోపెట్టు
మదులను ముట్టు
ఇంపైన
కవితలు
వ్రాయి
సొంపుగా తీర్చిదిద్దు
అద్వితీయమైన
కవితలు
సృష్టించు
కవిబ్రహ్మగా కలకాలమునిలువు
మనసున్నకవి
విన్నపాలను విను
పదాలు ప్రయోగించు
కవితాఝరులు పారించు
కవీ
ఖ్యాతిని పొందు
సాహిత్యములో వెలుగు
అమరుడిగా నిలువు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment