ఓ తెలుగోడా!
తెలుగు వైభవంపొందాల్సిందే
పేరుప్రఖ్యాతులు రావాల్సిందే
తెలుగుకు పట్టంకట్టాల్సిందే
తెలుగురాజ్యస్థాపన జరగాల్సిందే
తెలుగు వెలిగిపోవాల్సిందే
దశదిశలా వ్యాపించాల్సిందే
కవితలు పుట్టాల్సిందే
తీపిని చల్లాల్సిందే
కవితాసేద్యం చేయాల్సిందే
పంటలు పండించాల్సిందే
అక్షరగింజలు తేవాల్సిందే
సిరిసంపదలు కూడాల్సిందే
కవితలవంట చేయాల్సిందే
వడ్డించి తీరాల్సిందే
పాఠకులకడుపులు నింపాల్సిందే
కోరికలు తీర్చాల్సిందే
అందాలు చూపాల్సిందే
ఆనందాలు పంచాల్సిందే
తెలుగోళ్ళమదులు తట్టాల్సిందే
హృదయస్థానము పొందాల్సిందే
తెలుగుభాష వృద్ధిచెందాల్సిందే
వెలుగులు చుట్టూచిమ్మాల్సిందే
తెలుగుతల్లిని కొలవాల్సిందే
తల్లిఋణమును తీర్చుకోవాల్సిందే
తెలుగోడా నడుంబిగించరా
వడివడిగా ముందుకునడువురా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment