ఓ నాచెలీ!
నీ నగుమోము
నాకు సుందరదృశ్యము
నువ్వు నవ్వేనిమిషం
నాకు నచ్చేసమయం
నీ పెదాలపలుకులు
నాకు తీపిమిఠాయీలు
నీ చిలిపుచూపులు
నాలోలేపు ప్రేమజ్వాలలు
నీ కొంటెసరసాలు
నాకు ఇచ్చుసరదాలు
నీ వంటిషోకులు
నా కంటికింపులు
నీ అందాలరూపం
నాకు ఆనందభరితం
నీ ఒయ్యారినడకలు
నాలోలేపు కోర్కెలు
నీ నోటిపిలుపులు
నను నీచెంతకులాక్కొను
నీ చక్కనిరూపం
నాకు అప్సరసతోసమానం
నీ వలపుచేష్టలు
నామదికి బంధాలు
నీతో ప్రేమాయణం
నాకు మనోహరం
ఇంకెందుకు ఆలశ్యం
మనం కలుద్దాం
నిండు నూరేళ్ళజీవితం
కలసి హాయిగాగడిపేద్దాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment