ప్రియా!

(మాటతో ఆట)


ఓ మాట

చెప్పనా

మనసును

విప్పనా


ఈ మాట

మదిలోదాచుకోనా

బయటకు

వెల్లడించనా


ఆ మాట

వ్రాయనా

కాగితమును

చేతికివ్వనా


ఏ మాట

ఎందుకు

కళ్ళల్లో

చూపనా


నా మాట

వింటావా

నన్ను 

చేరతావా


నీ మాట

చెబుతావా

నాబాట

నడుస్తావా


పై మాట

మనకొద్దు

వాదులాట

అసలొద్దు


ఆ మాట

ఈ మాట

ఏ మాట

వినవద్దు


మన మాట

మన బాట

మన ఆట

ఒక్కటవ్వాలి


ఒకే మాట

మనదికావాలి

ఒకేపాట

మనముపాడాలి


మన మాట

నెగ్గాలి

మన గంట

మ్రోగాలి


ఈ మాట

విను

నీ మాట

తెలుపు


నీ మాటకు

ఎదురుచూస్తున్నా

నీ రాకకు

నిరీక్షిస్తున్నా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog