అడుగో కవి!


ఆలోచనలలో

మునిగియున్నాడు

అమృతాన్ని

కురిపించచూస్తున్నాడు


విషయాలను

వెదుకుతున్నాడు

విందునివ్వటానికి

వేగిరపడుతున్నాడు


కలాన్ని

కదిలిస్తున్నాడు

కవితలను

కూరుస్తున్నాడు


కాగితాలపై

గీస్తున్నాడు

కైతలను

సృష్టిస్తున్నాడు


కైతలను

వండుతున్నాడు

పాఠకులకు

వడ్డించపోతున్నాడు


అందాలను

చూపాలనుకుంటున్నాడు

ఆనందాలను

అందించచూస్తున్నాడు


కల్పనలు

చేస్తున్నాడు

భావకవితలను

బయటపెట్టబోతున్నాడు


అక్షరసేద్యము

చేస్తున్నాడు

కవనపంటలు

పండించప్రయత్నిస్తున్నాడు


ఊహలను

ఊరిస్తున్నాడు

కవిత్వాన్ని

త్రాగించాలనుకుంటున్నాడు


అక్షరాలతో

కుస్తీపడుతున్నాడు

పువ్వులులా

మాలలల్లుతున్నాడు


పదాలతో

ప్రయోగంచేస్తున్నాడు

ప్రాసలతో

పరవశింపజేయాలనుకుంటున్నాడు


కలలు

కంటున్నాడు

పుటలపై

పెడుతున్నాడు


కవ్వింపులకు

గురవుతున్నాడు

కవితాకన్యలతో

కాలంగడుపుతున్నాడు


కవులు

ఘటికులు

పండితులు

స్మరణీయులు


కవులు

అసమానులు

ఆప్తులు

అమరులు


కవులను

గుర్తించుదాం

కవితలను

అస్వాదించుదాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog